రేషన్‌కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి
రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. జూన్ నుంచి రేషన్ సరుకులతో పాటు..
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు, తృణధాన్యాలను ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. జూన్ నెల నుంచి రేషన్ సరుకులతో పాటు సబ్సిడీపై కందిపప్పు, ఉచితంగా రాగులు ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 1.46 కోట్లకుపైగా రేషన్‌కార్డుదారులు ఉన్నారు. ఈ క్రమంలోనే 3 నెలలకు సరిపడా కందిపప్పు, ఏడాదికి సరిపడా రాగుల సేకరణకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి.. ప్రక్రియ పూర్తి చేసింది.
రేషన్‌కార్డుదారులతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీఎస్ లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సరిపడేలా రూ.500 కోట్ల విలువైన 47,037 టన్నుల కందిపప్పు, రూ.100 కోట్లకు పైగా విలువైన 25 వేల టన్నుల రాగులు, 43,860 టన్నుల పంచదార సేకరణకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ఎన్‌ఈఎంఏల్ పోర్టల్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. కందిపప్పును కిలో ప్యాకెట్ల రూపంలో రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకు రవాణా చేయనున్నారు. అలాగే రాగులను క్వింటాళ్ల లెక్కన గోనెసంచుల్లో రవాణా చేయనున్నారు.