ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 మందిని స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల్లో నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమిక స్థాయిలో 1136 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టుల భర్తీకి, సెకండరీ స్థాయిలో 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో తెలిపింది.