Ap Government Appoints Another Advisor For Finance Department. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్
By Medi Samrat Published on 6 Sept 2021 6:46 AM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్ ను నియమించింది. కేబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారుగా రెండేళ్లు ఆయన పనిచేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రజనీష్ కుమార్ గతంలో ఇంగ్లాండ్, కెనడాలోని పలు ఆర్థిక సంస్థల్లో విధులు నిర్వహించారు. ఫిన్‌టెక్ సంస్థల్లో నిపుణుడిగా రజనీష్ ఉన్నారు. రజనీష్ కుమార్ పలు ఆర్థిక సంస్థల్లో అనుభవం గడించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను ఎంపిక చేసింది.