దీపం పథకంపై గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
దీపం పథకం నగదు చెల్లింపులు ముందుగానే జరిపేందుకు నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik
దీపం పథకంపై గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపం పథకం నగదు చెల్లింపులు ముందుగానే జరిపేందుకు నిర్ణయం తీసుకుంది.సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలని టీడీపీ పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. ఒక ఏడాదిలో 3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లిస్తామని ప్రకటించింది. లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసుకున్నా.. తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి వారి బ్యాంకు ఖాతాల్లో వేసేలా నిర్ణయం తీసుకుంది.
మరో వైపు ప్రతి నెలా సంక్షేమం అందేలా ఏడాదికి సరిపడా సంక్షేమ క్యాలెండర్ విడుదలకు టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. జూన్ 12వ తేదీన ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక గత ప్రభుత్వం నిలిపివేసిన పెన్షన్లను కూడా పునరుద్ధరించాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు జూన్ 12వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు నెలల్లో ప్రారంభించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు పొలిట్ బ్యూరో ప్రకటించింది.