స్త్రీ శక్తి పథకం..మరో గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్త చెప్పింది.
By Knakam Karthik
స్త్రీ శక్తి పథకం..మరో గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్త చెప్పింది. ఉచిత బస్సు ప్రయాణంలో ఘాట్ రూట్లలో కూడా స్త్రీ శక్తి పథకం వర్తింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. కాగా స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి. ఈ పథకం వల్ల బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది.
సోమవారం ఒక్క రోజే 18 లక్షల మంది ఉచిత ప్రయాణాలు జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జీరో ఫేర్ టికెట్ ద్వారా మహిళలకు రూ.7 కోట్లకు పైగా ఆదా అయినట్లు తెలిపింది. 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం..రూ.19 కోట్ల లబ్ది చేకూరినట్లు తెలిపింది. కాగా ఉచిత ప్రయాణానికి గుర్తింపు కార్డు సాఫ్ట్ కాపీ చూపినా ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ఆర్టీసీ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తమ ఆధార్ కార్డును డిజిలాకర్‌లో చూపిస్తే ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తారు. గుర్తింపు కార్డు సాఫ్ట్ కాపీ చూపినా బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఓకే చెబుతారు. ఘాట్ రూట్లలో కూడా పథకం వర్తింపజేయాలని సూచించారు చంద్రబాబు.