Andhra Pradesh: స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు సెలవులు ఇచ్చింది.
By అంజి
Andhra Pradesh: స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు సెలవులు ఇచ్చింది. విద్యాశాఖ అధికారులు దీనికి సంబంధించిన షెడ్యూల్‌ని కూడా రిలీజ్ చేశారు. ఎస్‌ఏ-1 పరీక్షలను అక్టోబర్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు గతేడాది అనుసరించిన సరి - బేసి విధానాన్ని ఈ సారి అమలు చేయడం లేదు. 8వ తరగతి మినహా మిగతా అన్నీ తరగతుల పరీక్షలు మార్నింగ్ సమయంలో నిర్వహించనున్నారు.
గతంలో 6,8,10 తరగతులకు ఉదయం పూట, ఏడు, తొమ్మిది తరగతుల వారికి మాత్రం మధ్యాహ్నం పూట పరీక్షలు నిర్వహించారు. దీంతో, పరీక్షల నిర్వహణ, సీటింగ్ ఏర్పాట్లు సులువుగా మారాయి. ఎస్ఏ-1 పరీక్షల అనంతరం స్కూళ్లకు సెలవులు మొదలవుతాయి. పరీక్షలు 11న ముగియగానే మధ్యలో ఓ రోజు విరామం ఇచ్చి అనంతరం 13వ తేదీ నుచి 25 వ తేదీ వరకూ దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. తిరిగి అక్టోబర్ 26 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ప్రభుత్వం పేర్కొంది.
తెలంగాణలో కూడా..
అక్టోబర్ 24వ తేదీన దసరా పండగ జరగనుంది. అక్టోబర్ 22వ తేదీ దుర్గాష్టమి అంటే పెద్ద బతుకమ్మ పండగ జరగనుంది. ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు 25వ తేదీ వరకు మొత్తం 13 రోజులు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.