తెలుగు భాషకు నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం

తెలుగును ప్రోత్సహించడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో భాషాభివృద్ధికి 10 కోట్ల రూపాయలు కేటాయించింది

By Medi Samrat  Published on  28 Feb 2025 2:15 PM IST
తెలుగు భాషకు నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం

తెలుగును ప్రోత్సహించడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో భాషాభివృద్ధికి 10 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశవ్యాప్తంగా జాతీయ విద్యా విధానం మూడు భాషల ఫార్ములాపై చర్చ జరుగుతున్న తరుణంలో ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేస్తూ, తెలుగు పురాతన భాషలలో ఒకటి అని, దానిని సంరక్షించడానికి, పరిరక్షించడానికి నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. అందులో తొలిసారిగా తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. తెలుగు భాషాభివృద్ధికి దాదాపు రూ.10 కోట్లు కేటాయించడం విశేషం. రూ.3.22 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రూ.48 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ రూపొందించారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి రూ.3 లక్షలు కోట్లు దాటింది. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ.3 లక్షల కోట్లు దాటినట్లు ప్రభుత్వం తెలిపింది.

Next Story