ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల బాలికపై ఒడిశాలోని బెర్హంపూర్‌లో సామూహిక అత్యాచారం జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కడప జిల్లాకు చెందిన ఈ బాలిక, తన సవతి తండ్రి లైంగిక వేధింపుల నుండి తప్పించుకోవడానికి ఇంటి నుండి పారిపోయి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో బెర్హంపూర్ చేరుకుంది. అక్కడ రైల్వే స్టేషన్ సమీపంలోని టీ స్టాల్‌లో పనిచేస్తుండగా, పరిచయమైన ఓ 15 ఏళ్ల బాలుడు ఆమెను నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లాడు.
మార్చి 29న ఆ బాలుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను రక్షించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరిని (23, 19 ఏళ్లు) అరెస్ట్ చేయగా, 15 ఏళ్ల బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు, బాలిక పారిపోవడానికి కారణమైన సవతి తండ్రిపై కూడా ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది.