వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుంది : బాలినేని

తెలంగాణలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో టీడీపీ పూసుకుని, రాసుకుని ప్రచారం చేయటం వల్లే కాంగ్రెస్ ఓడిందని

By Medi Samrat  Published on  10 Dec 2023 2:30 PM GMT
వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుంది : బాలినేని

తెలంగాణలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో టీడీపీ పూసుకుని, రాసుకుని ప్రచారం చేయటం వల్లే కాంగ్రెస్ ఓడిందని వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ వాళ్లు ఎంత రోడ్ల మీదకు వచ్చినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని పేర్కొన్నారు.

తెలంగాణలో టీడీపీ సపోర్ట్ కాంగ్రెస్‌కు, జనసేన సపోర్ట్ బీజేపీకి ఉందన్నారు. ఇక్కడ టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకుంటాయని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుందన్నారు. అసలు టీడీపీ, జ‌న‌సేన‌ పార్టీలకు నైతికత ఉందా అని ప్ర‌శ్నించారు. త్వరలో గుండ్లకమ్మ గేట్లు ఏర్పాటు చేస్తాయ‌ని పేర్కొన్నారు.

ఇదే సమయంలో సీఎం జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనపై టీడీపీ నేతలు విమర్శలు చేయడాన్ని బాలినేని ఖండించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏమైనా సైకిల్ మీద పరామర్శకు వెళ్లాడా అంటూ సెటైర్లు వేశారు. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయం అని బాలినేనే ధీమా వ్య‌క్తం చేశారు.

Next Story