ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ ఫీజుల ఖరారు

AP Engineering And Pharmacy Fees. ఏపీ‌లో ఇంజినీరింగ్‌,ఆర్కిటెక్చర్, బి-ఫార్మసీ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు

By Medi Samrat  Published on  24 Dec 2020 4:20 AM GMT
ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ ఫీజుల ఖరారు

ఏపీ‌లో ఇంజినీరింగ్‌,ఆర్కిటెక్చర్, బి-ఫార్మసీ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వురుగా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ ప్రొఫెషనల్‌ విద్యాసంస్థల్లో కోర్సులకు ఫీజులను ఖరారు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2020–21, 2021–22, 2022–23 విద్యా సంవత్సరాలకు ఈ ఫీజులు అమ‌ల్లో ఉండ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది‌. ఇంజినీరింగ్ కళాశాలలకు కనిష్టంగా రూ. 35 వేలు గరిష్టంగా రూ. 70 వేలుగా ఫీజులు నిర్ధారించింది. ఐదు కళాశాలలకు అత్యధికంగా రూ. 70 వేలు ఫీజుగా ఖరారు చేసింది. 113 బీఫార్మసీ ప్రైవేట్ కళాశాలలకు కనిష్టంగా రూ. 35 వేలు.. గరిష్టంగా రూ. 65 వేలుగా ఖరారు చేసింది. ఇంజనీరింగ్‌ విభాగంలో మెరైన్‌ ఇంజనీరింగ్‌ ఫీజు రూ.1.25 లక్షలుగా ఖరారు చేసింది.

సంబంధిత కాలేజీలు సమర్పించిన వివిధ పత్రాలను ఆడిట్‌ చేసిన తర్వాత యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఆయా సంస్థలకు కోర్సుల వారీగా ఫీజులను సిఫార్సు చేసింది. దీన్ని అనుసరించి ఉన్నత విద్యా శాఖ ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అన్నిరకాల రుసుములతోనే ప్రభుత్వం ఈ ఫీజులను ఆయా సంస్థలకు నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని కంటే ఎక్కువ ఫీజులు వ‌సూలు చేయ‌డానికి వీల్లేద‌ని తెలిపింది.


Next Story