ఉద్యోగులకు ఏ సమస్యలున్నా ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చర్చలు కొనసాగుతాయని.. వచ్చే నెలాఖరులోపు ఉద్యోగుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. వచ్చే నెల నుంచి ఉద్యోగుల వేతనాలు సకాలంలో ఇచ్చేలా చర్యలు తీసుకుంటోందని వెల్ల‌డించారు. నేడు జరిగిన చర్చలు అధికారికం కాదు. సీఎస్ తో త్వరలో జరిపే సమావేశమే అధికారిక సమావేశం అని తెలిపారు. ప్రభుత్వం అన్ని ఉద్యోగ సంఘాలను సమానంగా చూస్తుందని.. ఉద్యోగ సంఘాల వ్యవహారంలో రాజకీయాలు చొప్పించాలని చూస్తే వారు ఫూల్స్ అవుతారని స‌జ్జ‌ల అన్నారు. మంగళవారం ఏపి ఎన్జీఓ, అమరావతి ఉద్యోగ సంఘాల జేఏసి నేతలుసజ్జల రామకృష్ణారెడ్డిని కలసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందచేశారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం నాడు ఉద్యోగ సంఘాల నేతలు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయరెడ్డిలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉద్యోగులు పే రివిజన్ కమీషన్ సిిఫార్సుల అమలు, సకాలంలో వేతనాలు అందచేయాలని, సిపిఎస్ రద్దు వంటి పలు సమస్యలను ప్రస్తావించారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిధ్దంగా ఉందని.. అయితే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అన్ని ఉద్యోగసంఘాల సమావేశం ఏర్పాటుచేసి విస్తృతస్ధాయిలో చర్చించిన తర్వాత.. ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.


సామ్రాట్

Next Story