ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ సభ్యుడు, అనంతపురం డీసీసీ మాజీ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి కూడా వైసీపీలో చేరారు. సాకే శైలజానాథ్ వైసీపీలో చేరిక సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, పాల్గొన్నారు.
గతంలో శైలజానాథ్ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రాథమిక విద్యాశాఖ, పాఠ్య పుస్తకాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన 2022 జనవరి 16 నుంచి 2022 నవంబర్ 23 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు.