టీడీపీలో చేరిన జీవీరెడ్డి.. కారణం అదేనటా.!

AP Congress leader gv reddy joins in TDP. ఏపీ కాంగ్రెస్ నాయకుడు జీవీ రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు సమక్షంలో జీవీరెడ్డి పసుపు కండువా

By అంజి
Published on : 21 Oct 2021 11:40 AM IST

టీడీపీలో చేరిన జీవీరెడ్డి.. కారణం అదేనటా.!

ఏపీ కాంగ్రెస్ నాయకుడు జీవీ రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు సమక్షంలో జీవీరెడ్డి పసుపు కండువా కప్పుకున్నారు. క్రీయాశీలక పార్టీలో చేరాలన్న నిర్ణయంతోనే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు జీవీరెడ్డి తెలిపారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జీవీరెడ్డిని.. చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వాఆనించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు జీవీరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, రాష్ట్రానికి మరింత నష్టం వాటిల్లవద్దంటే చంద్రబాబును బలపర్చాల్సిన అవసరం ఉందని జీవీ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ వినాశనం కోరుకునే వ్యక్తి అంటూ విమర్శించారు. చంద్రబాబు కొన్ని వర్గాలు అకారణంగా ద్వేషాన్ని పెంచుకున్నాయని, అందువల్లే రాష్ట్రం నాశనమైందని జీవీరెడ్డి అన్నారు. చంద్రబాబు అభివృద్ధి కోరుకునే వ్యక్తి అన్నారు. విజన్‌ లేకుండా నిధులు ఇష్టానుసారం పంచితే భవిష్యత్‌ ఆగమ్యగోచరమే అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Next Story