రైతులకు ఇచ్చిన హామీలు 100 శాతం నెరవేర్చాం: ఏపీ సీఎం జగన్‌

AP CM YS Jagan releases rythu bharosa funds. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రైతులకు ఇచ్చిన హామీలను 100 శాతం నెరవేర్చామని సీఎం వైఎస్ జగన్‌ అన్నారు. రాష్ట్ర

By అంజి  Published on  26 Oct 2021 4:54 PM IST
రైతులకు ఇచ్చిన హామీలు 100 శాతం నెరవేర్చాం: ఏపీ సీఎం జగన్‌

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రైతులకు ఇచ్చిన హామీలను 100 శాతం నెరవేర్చామని సీఎం వైఎస్ జగన్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా అన్ని చర్యలు తీసుకున్నాని సీఎం జగన్‌ చెప్పారు. మంగళవారం రోజు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ, వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. ఒకే రోజు రైతులకు సంబంధించిన మూడు పథకాలకు రూ.2190 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. అర్హులందరికీ రైతు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రైతుభరోసా కింద రూ.18,777 కోట్లు నిధులను ఇచ్చినట్లు సీఎం జగన్‌ తెలిపారు.

ఈ -క్రాప్‌ డేటా ఆధారంగా రూ.లక్ష లోపు లోన్‌ తీసుకున్నవారు.. టైమ్‌కి డబ్బులు జమ చేస్తే వారికి వడ్డీకి సర్కారే చెల్లిస్తుందన్నారు. 10,750 కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాలను రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే నిర్దేశించిన రేట్లకే ఈ కేంద్రాల్లో రైతులకు సేవలు అందుతాయని సీఎం జగన్‌ చెప్పారు. పంట వేసిన దగ్గరి నుండి అమ్మే వరకు అన్నింటా రైతులను చేయిపట్టుకుని నడిపించేలా రైతు భరోసా కేంద్రం వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. కల్తీ ఎరువులను అరికట్టడమే లక్ష్యమని, వీటి నివారణకు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు సీఎం జగన్‌ తెలిపారు. మూడోసారి రూ.50.37 లక్షల మందికి రైతు భరోసా - పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించి రూ.2,051.71 కోట్ల నిధులను రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు.

Next Story