ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ప్రధాని నివాసంలో గంటకు పైగా ఈ భేటీ కొనసాగింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రధానికి వినతి పత్రం కూడా అందించారు ముఖ్యమంత్రి. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలను ముఖ్యమంత్రి ప్రధాన మంత్రికి నివేదించారు. సుమారు గంటకుపైగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి నివేదించిన అంశాలపట్ల ప్రధాని సానుకూలంగా స్పందించారు.
మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం భేటీ కానున్నారు. అంతకు ముందు ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్‌కు ఎయిర్‌పోర్టులో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్, వంగా గీత, మాధవి, అయోధ్య రామిరెడ్డి, గురుమూర్తి, మాధవ్, రంగయ్య, రెడ్డప్ప, సత్యవతి, కోటగిరి శ్రీధర్, మోపిదేవి వెంకటరమణ ఘన స్వాగతం పలికారు.