భాషా వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందన ఇదే!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు జాతీయ విద్యా విధానం 2020, త్రిభాషా సూత్రంపై జరుగుతున్న చర్చపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  17 March 2025 5:40 PM IST
భాషా వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందన ఇదే!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు జాతీయ విద్యా విధానం 2020, త్రిభాషా సూత్రంపై జరుగుతున్న చర్చపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగిస్తూ, భాష అనేది జ్ఞానాన్ని కొలవడం కంటే కమ్యూనికేషన్‌కు ఒక సాధనం అని చెప్పారు.

“భాష ద్వేషించదగినది కాదు. మన మాతృభాష తెలుగు. జాతీయ భాష హిందీ. అంతర్జాతీయ భాష ఇంగ్లీష్. మన జీవనోపాధి కోసం వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవాలి, కానీ మన మాతృభాషను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.” అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాలలో కమ్యూనికేషన్ కోసం హిందీ నేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. "మనం ఢిల్లీకి వెళ్లినా, హిందీ వంటి జాతీయ భాషను నేర్చుకుంటే, అనర్గళంగా మాట్లాడటం వీలు అవుతుంది" అని ఆయన అన్నారు, ఈ అనవసరమైన రాజకీయాలకు బదులుగా, కమ్యూనికేషన్ కోసం అవసరమైనన్ని భాషలను ఎలా నేర్చుకోవచ్చో మనం ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.

Next Story