ఐదు ఎకరాల్లో సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు.

By Knakam Karthik
Published on : 9 April 2025 11:28 AM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, House Construction, New Residence

ఐదు ఎకరాల్లో సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. కుటంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 8.51 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

సచివాలయం వెనుక E9 రహదారి పక్కన వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల భూమిలో ఇంటి నిర్మాణం చేయనున్నారు. రాజధాని కోర్ ఏరియాలో చంద్రబాబు ఇంటిని కట్టుకుంటున్నారు. 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు నివాసంతో పాటు, పక్కనే కాన్ఫరెన్స్ హాల్, పార్కింగ్ ఏరియా ఉంటాయి. ఇంటిని 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ మోడల్ లో నిర్మించనున్నారు. ఏడాదిన్నర సమయంలో ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

Next Story