బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు, ఇది కరెక్టు కాదు: సీఎం చంద్రబాబు
తెలంగాణ ప్రాజెక్టులపై నేనెప్పుడు వ్యతిరేకించలేదు..అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు
By Knakam Karthik
బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు, ఇది కరెక్టు కాదు: సీఎం చంద్రబాబు
తెలంగాణ ప్రాజెక్టులపై నేనెప్పుడు వ్యతిరేకించలేదు..అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదు. సముద్రంలోకి పో యే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి. నీటి సమస్య పరిష్కారం అయితే తెలుగు ప్రజలు బాగుంటారు. బనకచర్లపై కొంత మంది మాట్లాడుతున్నారు.. ఇది కరెక్టు కాదు. సమైక్యాంధ్రలో నాడు నేనే దేవాదులకు పునాదులు వేశాను, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను.
అదే సమయంలో ఇక్కడకు వచ్చిన తర్వాత ఏపీలో పుష్కర, తాడిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్లను తీసుకువచ్చాం. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నపుడు వెల్లంపల్లి అన్నారు.. అది రాలేదు. తర్వాత అది పెద్ద స్కాం అయిందని పేర్కొన్నారు. గోదావరి ఏడాదిలో సగటున రెండువేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళుతున్నాయి.. ఆ నీటిలో 200 టీఎంసీలు ఇక్కడ, అక్కడ వాడుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. అదే తాను పదేపదే చెబుతున్నానని..సీఎం పేర్కొన్నారు.
సింగయ్య మరణంపై మాజీ ముఖ్యమంత్రి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదని ఆయన అన్నారు. సింగయ్య మరణంపై అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు కింద పడిన వ్యక్తిని ఎవరైనా వెంటనే ఆసుపత్రికి తరలిస్తారని, వైసీపీ నేతలకు ఈ కనీస స్పృహ కూడా లేదని ఆయన మండిపడ్డారు. మానవత్వం లేకుండా బాధితుడిని కంప చెట్లలో పడేసి వెళ్లారని విమర్శించారు. ఈ ఘటనపై రాజకీయం చేయాలని చూస్తున్నారని, బాధితుడు సింగయ్య భార్యను బెదిరించారని చంద్రబాబు ఆరోపించారు.