టార్గెట్-2029..సంపన్నులు సాయం చేయాలి, పేదరికం పోవాలి: సీఎం చంద్రబాబు

జీరో పావర్టీ పీ4 కార్యక్రమం తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమం..అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

By Knakam Karthik
Published on : 19 July 2025 10:37 AM IST

Andrapradesh, Amaravati, CM Chandrababu, P-4 mentors

టార్గెట్-2029..సంపన్నులు సాయం చేయాలి, పేదరికం పోవాలి: సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా... జీరో పావర్టీ పీ4 కార్యక్రమం తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమం..అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శులకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం విందు ఇచ్చారు. వారితో చంద్రబాబు మనసు విప్పి మాట్లాడారు. పీ-4 కార్యక్రమంపై తన ఆలోచనలను.. తాను పెట్టుకున్న లక్ష్యాలను పంచుకున్నారు. పీ4పై మార్గదర్శుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సంపన్నులు చేస్తే.. పేదరికం తగ్గుతుంది..అని సీఎం పేర్కొన్నారు.

ఈ ఏడాది ఆగస్టు 15కల్లా 15 లక్షల మంది బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలనేది తన సంకల్పమని... ఇందుకు సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలి. అంబేద్కర్ నుంచి అబ్దుల్ కలాం వరకు ఎంతోమందిని ఉన్నత స్థానానికి ఎదిగేలా చేసేందుకు వారి జీవితంలో ఎవరో ఒకరు సాయం చేశారు. సమాజంలో విజయం సాధించిన అందరూ సామాజిక బాధ్యతగా సమాజం కోసం తిరిగి ఖర్చు పెట్టాలి. గేట్స్ ఫౌండేషన్ ఈ విషయంలో స్ఫూర్తిగా నిలుస్తుంది. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చూసేందుకు కృషి చేస్తున్నాను. రాష్ట్రంలో ఇప్పటివరకు 5 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించాం. వీరికి సాయం చేసేందుకు 47 వేల మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారు. అని ముఖ్యమంత్రి చెప్పారు.

Next Story