రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్‌బుక్: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు.

By Knakam Karthik
Published on : 24 May 2025 1:23 PM IST

Andrapradesh, Cm Chandrababu, AP Government, Niti Aayog Summit

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్‌బుక్: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు. పహల్గాం దాడిని ఖండించి, ఆపరేషన్ సింధూర్ ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ ప్రసంగాన్ని సీఎం ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని సీఎం చంద్రబాబు వివరించారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను తన ప్రజెంటేషన్‌లో సీఎం ప్రస్తావించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రజెంటేషన్ సీఎం వివరించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్టు ప్రజెంటేషనులో వివరించారు. రాష్ట్రంలో ఉన్న వనరులను తాము ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామనే విషయాన్ని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దినున్నట్టు తెలిపారు. విశాఖకు గ్లోబల్ హంగులు అద్దేలా నాలుగు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. విశాఖ మోడల్‌ను అమరావతి, తిరుపతి, గోదావరి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని చంద్రబాబు కోరారు.

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఒప్పందం.. కర్నూల్‌లో డ్రోన్ సిటీ ప్లాన్లను ప్రజెంటేషనులో ప్రత్యేకంగా వివరించారు. డిజిటల్ గవర్ననెన్సులో భాగంగా గూగుల్ AI వంటి టెక్నాలజీలను వినియోగిస్తున్నట్ చెప్పారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్‌బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు బిడ్డల నిబంధన రద్దు చేశామని, మాతృత్వ సెలవులను 180 రోజులకు పెంచినట్టు సీఎం వెల్లడించారు.

Next Story