షాకింగ్‌ వీడియో.. చంద్రబాబు, ట్రైన్‌ మ‌ధ్య గ్యాప్ చూస్తే..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు మధురానగర్ వెళ్లారు.

By Medi Samrat  Published on  5 Sept 2024 5:52 PM IST
షాకింగ్‌ వీడియో.. చంద్రబాబు, ట్రైన్‌ మ‌ధ్య గ్యాప్ చూస్తే..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు మధురానగర్ వెళ్లారు. వరద నీరు సరిగా కనిపించకపోవడంతో రైల్వే ట్రాక్ పైకి ఎక్కారు. చంద్రబాబు కాలినడకన రైలు వంతెన పైకి వెళ్లి బుడమేరును పరిశీలించారు. వంతెనపై చంద్రబాబు నడుస్తుండగానే, ఓ రైలు ఎదురుగా వచ్చింది. అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయనకు కేవలం మూడు అడుగుల సమీపం నుంచి రైలు వెళ్లింది. చంద్రబాబు ట్రాక్ కు కొంచెం పక్కగా నిలబడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైలు తనకు తగలకుండా చంద్రబాబు వంతెనపై జాగ్రత్తగా నిలుచుకున్నారు.

బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లోని జనం ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు. బుడమేరు వాగుకు పలుచోట్ల గండ్లు పడడంతో విజయవాడలోని పలు కాలనీలు నీట మునిగాయి. గండ్లను పూడ్చేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఈ పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్పారు.


Next Story