టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.
చంద్రబాబు ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ కేసుకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మద్యం అనుమతుల కేసులో ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. చంద్రబాబును మరోసారి అరెస్ట్ చేసేందుకు సీఐడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.