తాడేపల్లిలో సిట్ కార్యాలయం పెద్ద సంఖ్యలో పత్రాలను దహనం చేసిన ఘటనపై ఏపీ సీఐడీ స్పందించింది. పత్రాలు దహనం చేయడంపై వివరణ ఇచ్చింది. ఐదు కేసులకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేశామని, ఒక్కో చార్జిషీటులో 8 వేల నుంచి 10 వేల పేజీలు ఉన్నాయని సీఐడీ వెల్లడించింది. ఫొటో కాపీ యంత్రం వేడెక్కడంతో కొన్ని పేపర్లు ఇరుక్కుపోయి, సరిగా ప్రింట్ కాలేదని తెలిపింది. అస్పష్టంగా ప్రింట్ అయిన పత్రాలను దహనం చేస్తామని సీఐడీ స్పష్టం చేశారు. ఆయా కేసులకు సంబంధించి ఆధారాలన్నీ ఇప్పటికే కోర్టుకు సమర్పించామని వివరణ ఇచ్చింది.
సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాల దగ్ధంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?! అని ప్రశ్నించారు. నేర పరిశోధనపై దృష్టి సారించాల్సిన ఏపీసీఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మారిపోయిందని మేం ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నిజమయ్యాయన్నారు.