ముగిసిన ఏపీ కేబినేట్ భేటి.. కీలక నిర్ణయాలు ఇవే

AP Cabinet takes key decisions.ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న స‌చివాలంలో జ‌రిగిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినేట్ భేటి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Oct 2021 9:02 AM GMT
ముగిసిన ఏపీ కేబినేట్ భేటి.. కీలక నిర్ణయాలు ఇవే

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న స‌చివాలంలో జ‌రిగిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినేట్ భేటి ముగిసింది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌కు కేబినేట్ ఆమోదముద్ర వేసింది. అసెంబ్లీ స‌మావేశాల‌పై కూడా నిర్ణ‌యం తీసుకున్నారు. బీసీ జ‌న‌గ‌ణ‌న జ‌ర‌పాల‌ని అసెంబ్లీలో తీర్మానించే అంశానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మ‌కానికి వీలుగా సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్ట స‌వ‌ర‌ణ ఆర్డినెన్స్‌కు మంత్రివ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. విశాఖలోని మధురవాడలో 130 ఎకరాలను ఆదాని ఎంటర్‌ప్రైజెస్‌కు కేటాయించడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అటు శారదా పీఠానికి కూడా మధురవాడలో 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అమ్మఒడి ప‌థ‌కం అమ‌లుపై కేబినేట్‌లో చ‌ర్చ జ‌రిగింది. 75శాతం హాజ‌రు ఉండాల‌న్న నిబంధ‌న‌పై విస్తృతంగా ప్ర‌చారం చేసే అంశానికి కేబినేట్ ఆమోదం తెలిపింది.

కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

- ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకానికి వీలుగా.. సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదన‌కు

- 2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు

- వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ

- రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ అందించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి

- యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు ప్రతిపాదనకు

- అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు

- రాష్ట్రంలో 5చోట్ల సెవన్‌ స్టార్‌ పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు

- పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి

- విశాఖలో తాజ్‌ వరుణ్‌ బీచ్‌ ప్రాజెక్టుకు

- విశాఖ మధురవాడలో ఆదాని ఎంటర్‌ప్రైజెస్ సంస్థ‌కు 130 ఎక‌రాలు, శార‌దా పీఠానికి 15 ఎక‌రాలు ఇచ్చేందుకు

Next Story