జగన్ కేబినెట్ 2.O.. కొలువుదీరిన కొత్త మంత్రివ‌ర్గం

AP Cabinet Swearing Ceremony. ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం వెలగపూడిలో ఘనంగా జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

By Medi Samrat  Published on  11 April 2022 1:13 PM IST
జగన్ కేబినెట్ 2.O.. కొలువుదీరిన కొత్త మంత్రివ‌ర్గం

ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం వెలగపూడిలో ఘనంగా జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల పేర్లను అక్షర క్రమంలో సీఎస్ సమీర్ శర్మ చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్‌, ముఖ్యమంత్రి జగన్‌తో ఫోటో సెషన్‌ నిర్వహించారు.

తొలుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా.. త‌ర్వాత‌ అంజ‌ద్‌ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, గుమ్మనూరు జయరాం, కాకాని గోవర్థన్‌రెడ్డి. నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉషశ్రీ చరణ్‌, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ప్ర‌మాణం చేశారు. కొత్త కేబినెట్‌ మంత్రులకు ఎలాంటి శాఖలు వస్తాయో తెలియాల్సివుంది.










Next Story