కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు.. హోంమంత్రిగా తానేటి వనిత.. రోజాకు ఏ శాఖంటే..

AP Cabinet Ministers Portfolios. ఏపీలో కొత్త మంత్రులకు శాఖాల కేటాయింపు జరిగింది. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా

By Medi Samrat  Published on  11 April 2022 4:26 PM IST
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు.. హోంమంత్రిగా తానేటి వనిత.. రోజాకు ఏ శాఖంటే..

ఏపీలో కొత్త మంత్రులకు శాఖాల కేటాయింపు జరిగింది. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం కేబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం ఇచ్చారు. రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్‌ బాషా, నారాయణ స్వామిలకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు.

మంత్రులు - శాఖలు

ధర్మాన ప్రసాదరావు - రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు

సీదిరి అప్పలరాజు - పశుసంవర్ధక,మత్స శాఖలు

బొత్స సత్యనారాయణ - విద్యాశాఖ

రాజన్నదొర - గిరిజన సంక్షేమం (డిప్యూటీ సీఎం)

గుడివాడ అమర్నాథ్ - ఐటీ, పరిశ్రమలు

బూడి ముత్యాలనాయుడు - పంచాయతీరాజ్ (డిప్యూటీ సీఎం)

విశ్వరూప్ - రవాణాశాఖ

చెల్లుబోయిన వేణు -ఐఅండ్ పీఆర్, బీసీసంక్షేమం, సినిమాటోగ్రఫీ

దాడిశెట్ టిరాజా -రోడ్లు భవనాలు

తానేటి వనిత - హోంమంత్రి

కారుమూరి నాగేశ్వరరావు - పౌరసరఫరాలు

కొట్టు సత్యనారాయణ - దేవాదాయ (డిప్యూటీసీఎం)

జోగి రమేష్ - గృహనిర్మాణం

మేరుగు నాగార్జున - సాంఘిక సంక్షేమం

విడదల రజనీ - ఆరోగ్య, కుటుంబసంక్షేమం

అంబటి రాంబాబు - జలవనరులశాఖ

ఆదిమూలపు సురేష్ - మున్సిపల్ శాఖ

కాకాణి గోవర్ధన్ రెడ్డి - వ్యవసాయం, సహకారశాఖ

ఉషా శ్రీచరణ్ - స్త్రీ శిశు సంక్షేమం

అంజాత్ బాషా - మైనార్టీ వ్యవహారాలు -(డిప్యూటీ సీఎం)

బుగ్గన రాజేంద్రనాథ్ - ఆర్ధిక, వాణిజ్యపన్నులు, ప్రణాళిక

గుమ్మనూరు జయరాం - కార్మికశాఖ

పెద్దిరెడ్డి - విద్యుత్, అటవీ, పర్యావరణం

రోజా - టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ

నారాయణస్వామి - ఎక్సైజ్ (డిప్యూటీ సీఎం)














































































































Next Story