రేపు ఏపీ కేబినెట్ భేటీ.. రుషికొండ భవనాలు సహా కీలక అంశాలపై చర్చ
రేపు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంకానుంది
By - Knakam Karthik |
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. రుషికొండ భవనాలు సహా కీలక అంశాలపై చర్చ
అమరావతి: రేపు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంకానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ మీటింగ్‌లో కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. మూడు కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవిన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో రూ.103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు..అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాల కల్పనకు రూ.109 కోట్ల కేటాయింపు, శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాలు భూ కేటాయింపు, 8400 క్యూసెక్కుల కెపాసిటీతో రూ.444 కోట్లతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
ఇంకా ఎల్పీఎస్ జోన్-8లో లే-అవుట్ల అభివృద్ధికి రూ.1358 కోట్లు కేటాయింపు, 202 ఎకరాల భూమి జరీబు లేదా మెట్ట ప్రాంతమా అని నిర్దారణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు, పలు సంస్థలకు భూ కేటాయింపులు, రుషికొండ నిర్మాణాలకు సంబంధించి కూడా చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. తాజా రాజకీయ పరిణామాలు మెడికల్ కాలేజీ టెండర్లు పిపిపి విధానం పై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.