అమరావతి: రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ నెల 14,15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై ప్రధాన చర్చ జరగనుంది. ఇప్పటికే సదస్సు ఏర్పాట్లు భాద్యతలను మంత్రులు, అధికారులకు సీఎం అప్పగించారు.
కాగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మొంథా తుపాన్ ప్రభావం, నష్టం అంచనాలు, పరిహారంపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. NaBFID నుంచి రూ.7500 కోట్లు రుణం తీసుకునేందుకు సీఆర్డీఏకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. మరో వైపు పలు సంస్థలకు భూ కేటాయింపులకు రాష్ట్ర మంత్రిర్గం ఆమోదం తెలపనుంది.