నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే ఛాన్స్
నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది
By Knakam Karthik
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే ఛాన్స్
నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కీలకమైన ఎస్ఐపీబీ రెండు సమావేశాల్లో అమోదం తెలిపిన పెట్టుబడులకు కేబినెట్ అమోదం తెలపనుంది. అమరావతి అథారిటీలో అమోదించిన పలు అంశాలకూ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఐటీలో కీలకమైన నాలుగు పాలసీలకు అమోదం తెలపనుంది. రాజధాని లో రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంశంపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే క్రమంలో ఈ నెల 25 నుండి 30 వరకు సీఎం నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనపై చర్చించనున్నారు.
8వ ఎస్‌ఐపీబీలలో ఆమోదించిన రూ.39,473 కోట్ల పెట్టుబడులతో పాటు.. 9వ ఎస్ ఐ పి బి సమావేశంలో అమోదించిన నాలుగు కంపెనీల ద్వారా రూ.20 వేల కోట్లు పెట్టుబడులకు అమోదం తెలపనున్నారు. వీటి ద్వారా సుమారు 80 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో వైజాగ్‌లో కీలకమైన రూ.16,466 కోట్లతో సీఫా సెంటర్ రానుంది..ఇది వైజాగ్ ఇమేజ్‌ను మరింత పెంచనుంది..
అటు అమరావతిలో నిర్మాణాలపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. ఇదే క్రమంలో సీఆర్డీఏ అథారిటీలో అమోదించిన పలు ప్రతిపాదలనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాజధాని లో రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంశంపై గత క్యాబినెట్ లో చర్చించారు..నేడు మరో సారి చర్చించనున్నారు..ఇక అమరావతిలో నీరుకోండ పై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పైన చర్చజరిగే అవకాశం ఉంది.. నాలా చట్టం పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. బిల్డింగ్ ఫినలైజెషన్ స్కీం, ల్యాండ్ రెగ్యూలరైజెషన్ స్కీమ్‌లకు అమోదం తెలపనుంది..దీని వలన నిర్మాణ రంగం ఊపందుకునే అవకాశం ..దీంతో పాటు ఆయా సంస్థలకు నిధులు కూడా సమకూరే అవకాశం ఉంది.