ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది
By Medi Samrat Published on 19 Jun 2024 2:43 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సంద్భంగా ఈ నెల 21 సాయంత్రం 4 గంటల్లోగా కేబినెట్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనలను పంపించాలని ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదేశాలు అందాయి. ఇక ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.