నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం

నేడు ఉద‌యం 11 గంట‌ల‌కు స‌చివాల‌యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.

By Knakam Karthik
Published on : 9 July 2025 8:30 AM IST

Andrapradesh, Ap Cabinet, Cm Chandrababu, Amaravati

నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం

నేడు ఉద‌యం 11 గంట‌ల‌కు స‌చివాల‌యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. రాజధాని అమ‌రావ‌తి పరిధిలో మరో 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నుంది..అమ‌రావ‌తిలో ప‌లు హోట‌ల్స్‌కు భూ కేటాయింపుల‌కు అమోదం తెల‌ప‌నున్నారు. అమరావతిలో అల్లూరి సీతారామ‌రాజు, అమరజీవి పొట్టి శ్రీ‌రాములు స్మారక చిహ్నాలు ఏర్పాటుకు అమోదం తెల‌ప‌నున్నారు. రైతుల‌కు ఇచ్చే అన్న‌దాత సుఖిభ‌వ పై చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

రాజ‌ధాని అమ‌రావ‌తి రెండో ద‌శ విస్త‌ర‌ణ‌లో భాగంగా మ‌రో 20494 ఎక‌రాల భూములు ల్యాండ్ పూలింగ్ విధానంలో సేక‌రించేందుకు ఏపీ సీఆర్డీఏకు రాష్ట్ర మంత్రి వ‌ర్గం అనుమ‌తి ఇవ్వ‌నుంది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కార్లపూడిలేమల్లే, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో ఈ భూ సమీకరణ చేసేందుకు. రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్‌ఎఫ్‌పీ పిలిచేందుకు క్యాబినెట్ ఆమోదాన్ని తెలిపింది. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలలో ఫైనాన్స్, స్పోర్ట్స్ సిటీల్లోని దాదాపు 58 ఎకరాల్లో ఈ హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్‌పిని ఆహ్వానించేందుకు సీఆర్డీఏకు క్యాబినెట్ అనుమతి ఇవ్వ‌నుంది .

అలాగే అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ చేసిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదాన్ని తెలిపింది. మందడంలో వివాంతా, హిల్టన్ హోటల్స్, తుళ్లూరులో హయత్ రీజెన్సీ, లింగాయపాలెం నోవోటెల్ సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. క్వాలిటీ బేస్డ్ సెలెక్షన్ ప్రాతిపదికన ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి క్యాబినెట్ అమోదం తెల‌ప‌నుంది.

Next Story