ముగిసిన‌ ఏపీ కేబినెట్ సమావేశం.. పెన్ష‌న్ పెంచుతూ నిర్ణ‌యం

AP Cabinet Meeting. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న భేటీ అయిన మంత్రివ‌ర్గం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది.

By Medi Samrat  Published on  13 Dec 2022 3:28 PM IST
ముగిసిన‌ ఏపీ కేబినెట్ సమావేశం.. పెన్ష‌న్ పెంచుతూ నిర్ణ‌యం

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న భేటీ అయిన మంత్రివ‌ర్గం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. పెన్ష‌న్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రూ.2,500 నుంచి రూ.2,750 కు పించ‌న్‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. త‌ద్వారా 62.31 లక్షల మంది పింఛన్‌ లబ్ధిదారులకు మేలు జ‌రుగ‌నుంది. కొత్త లబ్దిదారులకు నవరత్నాల మంజూరు ప్రతిపాదనలకు ఆమోదం మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ పశు బీమా పథకం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్‌లు.. ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్‌లను.. నాడు నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం తెలిపింది. 8వ తరగతి విద్యార్థులకు ఈ కంటెంట్ అందించే పథకానికి కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులపై ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కడపలో జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్ ప్లాంట్‌కి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.8,800 కోట్ల పెట్టుబడితో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేప‌ట్ట‌నుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది.


Next Story