కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం

AP Cabinet Meet. శుక్ర‌వారం ఉద‌యం 11గంట‌ల‌కు సీఎం జ‌గ‌న్‌ అధ్య‌క్ష‌త‌న భేటీ అయిన కేబినేట్ స‌మావేశం

By Medi Samrat  Published on  6 Aug 2021 9:04 AM GMT
కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం

శుక్ర‌వారం ఉద‌యం 11గంట‌ల‌కు సీఎం జ‌గ‌న్‌ అధ్య‌క్ష‌త‌న భేటీ అయిన కేబినేట్ స‌మావేశం ఇంకా జ‌రుగుతుంది. ఈ భేటీలో ఆగస్టులో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్‌ ప్లస్ ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చ జ‌రిగింది. ఈ నెల 10న అమలు చేయనున్న 'వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం' పథకంపై చర్చించారు. పోలవరం నిర్వాసితుల ఆర్‌అండ్ఆర్‌ చెల్లింపులను కేబినెట్‌ ఆమోదించనుంది. రూ.10లక్షల పరిహారం చెల్లింపునకు రూ.550 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నుంది.

అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పానికి కేబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది. ధార్మిక పరిషత్ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటుపై చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి పాలసీని కేబినెట్ ఆమోదించనుంది. మచిలీపట్నం, భావనపాడు పోర్టుల రివైజ్డ్‌ అంచనాలను ఆమోదించనుంది కేబినెట్. బుడగట్లపాలెం, పూడిమడక, ఓడలేరు, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మంత్రి వర్గం ఓకే చెప్ప‌నుంది. లోకాయుక్త కర్నూల్‌కు తరలించే ప్రతిపాదనకు, హెచ్‌ఆర్‌సీ కార్యాలయం కర్నూలులో ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది.


Next Story
Share it