ముగిసిన ఏపీ కేబినేట్.. కీలక నిర్ణయాలు ఇవే..
AP Cabinet Meet. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది.
By Medi Samrat Published on 18 Dec 2020 4:52 PM ISTసీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ఆమోదం సహా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. కేబినేట్ భేటి అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
ఏపీ సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణకు ఆమోదం తెలిపామని, ప్రతిభూమికి సబ్ డివిజన్ ప్రకారం మ్యాప్ తయారు చేస్తారన్నారు.. ఏపీలో కొత్తగా 16 వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామని, అటు 27 వైద్య కళాశాలలకు రూ.16 వేల కోట్ల నిధులు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. డిసెంబర్ 29 న రైతుల అకౌంట్ లో రైతు భరోసా జమ చేయనున్నట్లు వెల్లడించారు. అధిక వర్షాల మూలం గానో ప్రకృతి వైపరీత్యాల మూలంగా 1200 కోట్లు ఇన్పుట్ సబ్సిడి ని ఇప్పటికే చెల్లించామని నివర్ తుఫాన్ వల్ల బాధితులు నష్టపోయారో వారి ఖాతాల్లోకి ఈనెల 29 న డబ్బు జమచేస్తామని మంత్రి పేర్కొన్నారు.
కేబినేట్ నిర్ణయాలు ఇవే..
- రూ.1200 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ చెల్లింపు.
- ఇన్ పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు.
- ఏపీ వైద్య విద్య పరిశోధన కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్ కు ఆమోదం.
- రాష్ట్రంలో నూతన టూరిజం పాలసీకి ఆమోదం.
- సమగ్ర భూ సర్వే, సరిహద్దు చట్టంలో సవరణలకు ఆమోదం
- నివర్ తుపాను బాధితులకు ఈ డిసెంబరు చివరిలోగా పరిహారం.
- రైతులకు ఏ సీజన్ లో పరిహారం ఆ సీజన్ లోనే చెల్లింపు.
- 6 జిల్లాల్లో వాటర్ షెడ్ అభివృద్ధి పథకం అమలుకు ఆమోదం.
- టూరిజం ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజి కింద ఆర్థిక సాయం.
- హోటల్ రంగం పునరుజ్జీవం కోసం రూ.15 లక్షల వరకు రుణం.
- రూ.400 కోట్లకు మించి పెట్టుబడులు పెడితే మెగా పరిశ్రమ హోదా. లీజు కాలాన్ని 33 నుంచి 99 ఏళ్లకు పెంపు.
- రాష్ట్ర అదనపు ఏజీగా జాస్తి నాగభూషణం నియామకానికి ఆమోదం.
- చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నాబార్డు నుంచి రూ.1,931 కోట్ల రుణం తీసుకునేందుకు జలవనరుల శాఖకు అనుమతి
- పశుసంవర్థక శాఖలో 147 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆమోదం