పవన్ వ్యాఖ్యలపై చర్చ జరగలే.. కేబినెట్ కీల‌క‌ నిర్ణ‌యాలివే..

హోంమంత్రి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండలిలో ఎటువంటి చర్చ జరగలేదని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు

By Medi Samrat  Published on  6 Nov 2024 6:24 PM IST
పవన్ వ్యాఖ్యలపై చర్చ జరగలే.. కేబినెట్ కీల‌క‌ నిర్ణ‌యాలివే..

హోంమంత్రి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండలిలో ఎటువంటి చర్చ జరగలేదని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జ‌రిగింది. కేబినెట్ సమావేశం అనంత‌రం మంత్రి కొలుసు పార్థసారథి క్యాబినెట్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ప్రెస్ మీట్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. ఐదేళ్లుగా రాష్ట్రం ఏ విధంగా ‌నష్టపోయిందో తెలిసిందే.. మావవ, సహజ వనరులు వుండి కూడా మన రాష్ట్రం అభివృద్ధి ‌చెందలేదన్నారు.

మంత్రిమండలి నిర్ణ‌యాలివే..

ఏపీ డ్రోన్ పాలసీకి మంత్రిమండలి ఆమోదం.. డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు..కర్నూలులో డ్రోన్ హబ్ ఏర్పాటు. వెయ్యి కోట్లు పెట్టుబడులు ల‌క్ష్యం..

ఏపీ డేటా సెంటర్స్ పాలసీకి మంత్రిమండలి ఆమోదం. 250 అదనపు డేటా సెంటర్‌ల ఏర్పాటు ల‌క్ష్యం..

ఏపీ సెమీ కండెక్టర్ మ్యానిఫ్యాక్షర్ పాలసీకి ఆమోదం. సెమీ కండెక్టర్ మ్యానిఫ్యాక్షర్ కంపెనీల ఏర్పాటు ప్రోత్సాహం.. ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ ను ఆకర్షించేందు కృషి.

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం.. కొత్త చ‌ట్టంలో 10 నుంచి 14 సంవత్సరాల శిక్ష‌ వుంటుంది.

ఎదుటి వ్యక్తిని ఆర్థికంగా దెబ్బతీసి రాజకీయంగా బాగుపడాలని కొందరు చూస్తారు. NRGS పనులకు 331 కోట్ల రూపాయలు వర్క్ లను గతంలో చేశారు. వారిని గత ప్రభుత్వం ఆర్థికంగా చిద్రం చేసింది. వారి పేమెంట్ విడుదల ‌చేయాలని క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఏపీ వస్తువులు, సేవల పన్నుల బిల్లు సవరణకు ఆమోదం

ఎక్సైజ్ పాలసీల్లో తెచ్చిన మూడు ఆర్డినెన్స్ కు అసెంబ్లీలో చట్టం చేసేందుకు క్యాబినెట్ ఆమోదం.

కుప్పం ఏరియా డవల్పెంట్ అథారిటీని పునరుద్ధరణకు క్యాబినెట్ ఆమోదం.

పిఠాపురం అర్బన్ డవల్పప్మెంట్ అథారిటీకి క్యాబినెట్ ఆమోదం.

సిఆర్డిఏ పరిధి పెంచేందుకు క్యాబినెట్ ఆమోదం.

సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో విద్యార్థులకు ఫీజులు చెల్లింపు కాలేజి అకౌంట్ లోకి వేయడంపై క్యాబినెట్ ఆమోదం .

ఏపీఐఐసీ 311 మంది పారిశ్రామిక వేత్తలకు భూ‌కేటాయిపుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Next Story