అమరావతి: పలు కారణాలతో ప్రభుత్వం కేటాయించినా ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారికి రాష్ట్రప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇళ్ల నిర్మాణ గడువును మరో రెండేళ్లు పొడిగించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 కింద రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను కొనసాగించి పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. డిసెంబర్, 2024కి ఈ పథకం పూర్తవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మార్చి 2026 వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు.
6.41 లక్షల ఇళ్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ, ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాలను ప్రస్తుత యూనిట్ విలువతోనే అమలులో ఉన్న పద్దతితో కొనసాగించడానికి, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అర్బన్ లో 6.41 లక్షల ఇళ్లు, గ్రామాల్లో 1.09 లక్షల ఇళ్లు ను పూర్తి చేయాలనే నిర్ణయించారు.