ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవతవకలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త ఎక్సైజ్ పాలసీ ఎప్పుడు వస్తుందా.. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో అనే చర్చ కొనసాగుతూ ఉన్న క్రమంలో ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన 217 జీవోను మంత్రివర్గం రద్దు చేసింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు చేయాలని కెబినెట్ సూచించింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి కెబినెట్ నిర్ణయం తీసుకుంది. రీ-సర్వే ప్రక్రియను అబయెన్సులో పెట్టాలని కెబినెట్ నిర్ణయం తీసుకుంది.