Andhrapradesh: బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం
రూ.3.24 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌కు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది.
By అంజి
Andhrapradesh: బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం
అమరావతి: రూ.3.24 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌కు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఆయన వెంకటాయపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. బడ్జెట్ ప్రతులను స్వామి వారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. అనంతరం వాటిని సీఎం, డిప్యూటీ సీఎంకు అందజేశారు.
కాగా ప్రధానంగా అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డ సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్‌లో కీలక కేటాయింపులు చేయనున్నట్టు సమాచారం. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ని రూపొందించారు. మండలిలో కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సూపర్ సిక్స్, అమరావతి, పోలవరం, వ్యవసాయం, విద్యాఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఉండనుంది.
అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు నాయుడు గారి ఛాంబర్లో సమావేశమైన కేబినెట్, బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.#APBudget2025 #PrajaBudget2025 #APAssembly #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/2zxPqEvpVg
— Telugu Desam Party (@JaiTDP) February 28, 2025