చంద్రబాబును కట్టప్పతో పోల్చిన బీజేపీ నేత

AP BJP in-charge Sunil Devdhar criticizes TDP chief Chandrababu. ఏపీ బీజేపీ ఇంఛార్జ్‌ సునీల్ దేవధర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

By Medi Samrat  Published on  13 July 2023 3:02 PM GMT
చంద్రబాబును కట్టప్పతో పోల్చిన బీజేపీ నేత

ఏపీ బీజేపీ ఇంఛార్జ్‌ సునీల్ దేవధర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దివంగత ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని, బాహుబలి వంటి ఆయనను కట్టప్ప మాదిరి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఈ విషయాన్ని తాను తొలిసారి చెపుతున్నానని అన్నారు. 2014లో బీజేపీతో కలిసి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ఆ తర్వాత బీజేపీని వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లిపోయారని అన్నారు. చంద్రబాబు వద్దని జగన్ ను ప్రజలు ఎన్నుకుంటే పరిస్థితి మరింత దిగజారిందని చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాగానే పని చేశారని.. ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పటికీ వాస్తవాలను మాట్లాడాలన్నారు. సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని.. ప్రజాపోరు యాత్ర ద్వారా పార్టీని వీర్రాజు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని చెప్పారు. పురందేశ్వరి నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ - జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్ లో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆశీనులయ్యారు. మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సమయంలో పాత్తుల అంశాన్ని పార్టీ నాయకత్వం చూసుకుంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు పురందేశ్వరి. పవన్‌తో సోమువీర్రాజు మాట్లాడుతూనే ఉండేవారని.. జనసేన తమకు మిత్ర పక్షమే అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.


Next Story