జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో న్యూ ఇయర్ వేడుకలు రద్దు..!
AP Banned New Year Celebrations. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో
By Medi Samrat Published on 16 Dec 2020 9:38 AM ISTకరోనా వైరస్ సెకండ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకలు రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకు అన్నిరకాల వేడుకలు రద్దు చేసింది. ముఖ్యంగా…న్యూఇయర్ క్రమంలో డిసెంబరు 31, జనవరి 1న వేడుకలు జరపరాదని స్పష్టం చేసింది. ఆ రెండు రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేయనున్నారు. రాష్ట్రంలో వైన్ షాపులు, బార్లు తెరిచి ఉంచే వేళలను కూడా తగ్గించనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా.. జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యలో కరోనా మరోసారి పెరిగే అవకాశం ఉందని కేంద్రం వైద్య సంస్థలు హెచ్చరించిన క్రమంలో రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విద్యా సంస్థలకూ కొన్ని సూచనలు చేశారు. విద్యార్థులకు వేడి నీళ్లు అందించాలని, మాస్కులతో పాటు శానిటైజర్ ఖచ్చితంగా అందుబాటులో ఉంచాలని సూచించారు. డిసెంబర్ 26 నుంచి టీచర్లు, విద్యార్థులు, విద్యా సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది ప్రతి 15 రోజులకొకసారి ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని తెలిపారు.
ఇక గడిచిన 24 గంటల్లో 61,452 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 500 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,336కి పెరిగింది. మరణాల సంఖ్య 7,064కి చేరింది. ఇప్పటివరకు 8,64,612 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 4,660 యాక్టివ్ కేసులు ఉన్నాయి.