ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం క్వశ్చన్ అవర్‌తో ప్రారంభమయ్యాయి. అయితే టీడీపీ నేతలు సభలో నిరసన తెలపడంతో సభ నుంచి వారిని సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్న టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అలాగే సీఎం జగన్‌పై జారీ చేసిన ప్రివిలేజ్ నోటీసును కూడా తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. రూల్ నంబర్ 317 విధిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
అసెంబ్లీలో సభ్యులెవరూ మొబైల్ ఫోన్లు, ప్లకార్డులు, ఇతర రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ రూలింగ్‌పై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలోకి ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. అంతకుముందు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియం వద్ద ఆందోళనకు దిగారు.