ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందడి మొదలుకాబోతోంది..!

AP Assembly Monsoon Session. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల సందడి మొదలుకాబోతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల

By Medi Samrat  Published on  4 Sep 2021 10:17 AM GMT
ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందడి మొదలుకాబోతోంది..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల సందడి మొదలుకాబోతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను అతి త్వరలోనే నిర్వహించనున్నారు. ఈ నెల 21 లేదంటే 22 తేదీల్లో ప్రారంభించి ఐదారు రోజులు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. డిసెంబరులో మరోమారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒకేసారి ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించడం కంటే ఇలా నిర్వహించడం బెటర్ అని భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ల ఎన్నికలను అసెంబ్లీ సమావేశాల సమయంలోనే నిర్వహించాలని గతంలో నిర్ణయించగా, ఇప్పుడీ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి కనుక ఎన్నికలు జరిగితే దాదాపు అన్ని స్థానాలను దక్కించుకునే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. ఈ స్థానాలను గెలుచుకున్న తర్వాత శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.


Next Story