ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కొత్త ప్రభుత్వం రావడంతో అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం రెండు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు.

By Medi Samrat  Published on  22 Jun 2024 4:15 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కొత్త ప్రభుత్వం రావడంతో అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం రెండు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. మొదటి రోజు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలను ప్రమాణ స్వీకారం చేయించారు. రెండో రోజు అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీకి చెందిన అయ్యన్నపాత్రుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఏపీ సభాధ్యక్షులు గా ఎన్నికైన అయ్యన్నకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం ఏపీ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు.

ఈరోజు ఏపీ అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వనమాడి వెంకటేశ్వరరావు శాసన సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆచంట ఎమ్మెల్యేగా ఎన్నికైన పితాని సత్యనారాయణ, వినుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన జీవీ ఆంజనేయులు వరుసగా ప్రమాణం చేశారు. మొదటిరోజు కొన్ని కారణాల వలన వీరు ముగ్గురు ప్రమాణస్వీకారం చేయలేకపోయారు.

Next Story