ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

AP Assembly Budget Sessions continues for fifth day. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఐదో రోజు సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌తో ప్రారంభమయ్యాయి.

By Medi Samrat
Published on : 14 March 2022 5:11 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఐదో రోజు సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌తో ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌పై సభలో చర్చ జరగనుంది. మరోవైపు.. శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల స‌మ‌యంతో సమావేశమైంది. తర్వాత గవర్నర్ ప్రసంగంపై చర్చ, బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. టీడీపీ సభ్యుల నిరసన, గందరగోళం మధ్య ఏపీ అసెంబ్లీ 5 నిమిషాల పాటు వాయిదా పడింది. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలు ప్రతిరోజూ సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని మంత్రి అన్నారు. ప్రతి అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. మరోవైపు టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంపైకి దూసుకెళ్లడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభను ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు.











Next Story