ఏపీ అసెంబ్లీ వాయిదా.. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేలు వీరే.!

ఆంధ్రప్రదేశ్‌ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. సభలోకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు మంత్రులు, సభ్యులు హాజరయ్యారు

By Medi Samrat  Published on  21 Jun 2024 3:44 PM IST
ఏపీ అసెంబ్లీ వాయిదా.. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేలు వీరే.!

ఆంధ్రప్రదేశ్‌ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. సభలోకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు మంత్రులు, సభ్యులు హాజరయ్యారు. అసెంబ్లీలో 'నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది' అనే ప్లకార్డులను కూటమి సభ్యులు ప్రదర్శించారు. తొలుత జాతీయ గీతాలాపన జరిగిన తర్వాత.. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలైంది.

అయితే ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. 175 మంది ఎమ్మెల్యేలలో ఈరోజూ 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు (వినుకొండ), పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ ) ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రేపు ప్రమాణం చేయనున్నారు. జూన్ 22 ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. ఉదయం 11 గంటలకు స్పీకర్ ని ఎన్నుకోనున్నారు.

Next Story