ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి..!
ఏపీలో పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు
By Medi Samrat Published on 22 April 2024 6:05 AM GMTఏపీలో పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32 కాగా.. బాలికల ఉత్తీర్ణత శాతం: 89.17గా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానం లో నిలిచింది.96.3 శాతం ఉత్తీర్ణతో టాప్ ప్లేస్ లో నిలిచింది. పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల్లో 86.69శాతం పాస్ అయ్యారు. 2803 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.. 17స్కూల్స్ లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. కర్నూల్ జిల్లా 62.47శాతం తో చివరి స్థానంలో నిలిచింది.
విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోమ్ పేజీలో "AP SSC Results 2024" లింక్‌పై క్లిక్ చేయాలి.
మీ రూల్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
ఫలితాలు, మార్కుల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు.
దాదాపు 6,30,633 మంది విద్యార్థులకు పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లించగా, వారిలో 6,16,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 30న ముగిశాయి. ఏప్రిల్ 1న మూల్యాంకనం ప్రారంభమైంది. 26 జిల్లాల్లో 25 వేల మంది ఉపాధ్యాయులు 47,88,738 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. గతంలో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ఏడాది గరిష్టంగా 900 మంది మూల్యాంకనాధికారులను నియమించారు. పరీక్షలు జరిగిన కేవలం 22 రోజుల్లోనే ఫలితాలను విద్యాశాఖ ప్రకటించింది.