టెన్త్ ఫలితాలు విడుదల

AP 10th Class Results. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి.

By Medi Samrat  Published on  6 Jun 2022 12:32 PM IST
టెన్త్ ఫలితాలు విడుదల

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యా శాఖ‌ మంత్రి బొత్స స‌త్యనార‌య‌ణ సోమ‌వారం ఫలితాలు విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/లో చూసుకోవ‌చ్చు. 2022 సంవ‌త్స‌రానికి గాను ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి టెన్త్‌ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. బాలికలు 70.70 శాతం ఉత్తీర్ణత సాధించ‌గా.. బాలురు 64.02 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఫ‌లితాల‌లో 78.3శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా మొదటి స్థానం సాధించ‌గా.. 49.7శాతం ఉత్తీర్ణతతో అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 797 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని స్కూళ్లు 71 ఉన్నాయి. ఇదిలావుంటే.. రేపటి నుంచి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించే అవ‌కాశం క‌ల్పించింది టెన్త్ బోర్డు. జులై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి.















Next Story