తిరుమల లడ్డూ దర్యాప్తులో మరో మలుపు..హైకోర్టు ఆదేశంపై సుప్రీంకోర్టు స్టే

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో మరో మలుపు తిరిగింది.

By -  Knakam Karthik
Published on : 26 Sept 2025 1:13 PM IST

Andrapradesh, TTD, Tirumala, Laddu Prasadam, Supreme Court, AP Highcourt, SIT

తిరుమల లడ్డూ దర్యాప్తులో మరో మలుపు..హైకోర్టు ఆదేశంపై సుప్రీంకోర్టు స్టే

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో మరో మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 26) నిలిపివేసింది. హైకోర్టు తీర్పులో, SIT బయట నుంచి అధికారిని నియమించడం ద్వారా సీబీఐ డైరెక్టర్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని పేర్కొంది. దీనిపై సీబీఐ డైరెక్టర్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బి.ఆర్. గవాయి, జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్.వి. అంజారియా లతో కూడిన బెంచ్ వాదనలు వినిపించింది. “SIT తమ పరిధిలో ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌ను నియమిస్తే దాంట్లో తప్పేం ఉంది?” అని సీజేఐ గవాయి ప్రశ్నించారు. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన ప్రకారం, సీబీఐ డైరెక్టర్ SIT సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించి, ఆ అధికారి (జె. వెంకట్ రావు)ను రికార్డు కీపర్‌గా కొనసాగనివ్వడం జరిగింది.

అయితే, హైకోర్టు జస్టిస్ హరినాథ్ అభిప్రాయం ప్రకారం, జె. వెంకట్ రావు SITలో భాగమని సుప్రీంకోర్టు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొనబడలేదని, అందువల్ల ఆయన్ను విచారణ కోసం నియమించడం సరికాదని తీర్పు ఇచ్చింది. పిటిషనర్ కడూరు చిన్నప్పన్నా వాదన ప్రకారం, జె. వెంకట్ రావు తనను బలవంతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారని, తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వమని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. 2024లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన SITలో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర పోలీస్ నుంచి ఇద్దరు అధికారులు, FSSAI నుంచి ఒక సీనియర్ అధికారి ఉండాలని స్పష్టంగా పేర్కొంది.

Next Story