విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో మరో అగ్నిప్రమాదం

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. ఫిషింగ్ హార్బర్ వద్ద గాంధీ విగ్రహం వద్ద బడ్డీలు నుంచి మంటలు ఎగసిపడ్డాయి.

By అంజి  Published on  1 Dec 2023 8:51 AM IST
fire, Visakhapatnam, fishing harbour, APnews

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో మరో అగ్నిప్రమాదం 

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. ఇటీవల అగ్నిప్రమాదం జరిగి బోట్లు కాలి బూడదైన కొన్ని రోజుల్లోనే మరో అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఫిషింగ్ హార్బర్ వద్ద గాంధీ విగ్రహం వద్ద బడ్డీలు నుంచి మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సార్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కానీ వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో వరుస అగ్నిప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు రూ.20 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. సిగరెట్ పీక కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం తీవ్ర నష్టం మిగిల్చిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలి బూడిదయ్యాయి. మత్స్యకారులకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. సీఎం వైఎస్‌.. బాధిత మత్స్యకార కుటుంబాలన్నింటికీ భారీ నష్టపరిహారం ప్రకటించి ఆదుకున్నారు. ఈ ఘటన గురించి మరువక ముందే వైజాగ్ హార్బర్‌లో మరో ప్రమాదం చోటు చేసుకోవడం స్థానికంగా అలజడి రేపింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పరిశీలించారు.

Next Story