అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం

కడప జిల్లా కమలాపురం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేశారు.

By -  Medi Samrat
Published on : 19 Nov 2025 4:38 PM IST

అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం

కడప జిల్లా కమలాపురం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేశారు. కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో జ‌రిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా సీఎం, రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంగాన్ని తిలకించారు.

రెండో విడతగా రూ.7 వేల చొప్పున 46,85,838 రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం జమ చేశారు. దీనికోసం రూ.3,135 కోట్లను కూటమి సర్కారు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది. రాష్ట్రంలోని అర్హులైన రైతులకు రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్ధిక చేయూతకు నిర్ణయం తీసుకున్న ప్ర‌భుత్వం.. మొదటి విడతలో ఈ ఏడాది ఆగస్టు 2న రూ.7 వేల చొప్పున రూ.3,174 కోట్లు అన్నదాతల ఖాతాలకు జమ చేసింది. ఈ రెండు విడతల్లో ప్రభుత్వం రూ.14 వేలను రైతుల ఖాతాలకు జమ చేసింది. 4 నెలల కాలంలోనే రూ. 6309.44 కోట్ల మేర అన్నదాతలకు ఆర్ధిక ప్రయోజనం కల్పించినట్లు ప్రభుత్వం వెల్ల‌డించింది.

Next Story